దినేష్ రెడ్డి: ఐపీఎస్ కు వెళతానంటే మన కెందుకీ ఉద్యోగాలని మా నాన్న అనేవారు: దినేష్ రెడ్డి

  • ప్రజలకు సేవ చేయొచ్చని చెబితే మా నాన్న ఒప్పుకున్నారు
  • పీజీ పూర్తి చేయకుండానే సివిల్స్ కొట్టాను
  • నేను చేసిన మొట్టమొదటి ఉద్యోగం ఏఎస్పీగానే
  •  నాటి విషయాలను ప్రస్తావించిన దినేష్ రెడ్డి

అసలు, ఐపీఎస్ కావాలని తాను మొదట్లో అనుకోలేదని, పీజీ చేసేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు  ఆ నిర్ణయం తీసుకున్నానని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి నాటి విషయాలను ప్రస్తావించారు. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఐపీఎస్ కావాలనే నిర్ణయాన్ని మా నాన్నకు చెప్పినప్పుడు, ఈ ఉద్యోగాలు మనకెందుకని అన్నారు. ఇలాంటి ఉద్యోగాలు చేస్తే పది మందికి సేవ చేయగలుగుతామని, మన ఆస్తులను కూడా మనం కాపాడుకోగలుగుతామని చెప్పి మా నాన్నను ఒప్పించా.

అలా, పీజీ కాక మునుపే ఐపీఎస్ సీటు సాధించి.. ఏపీ క్యాడర్ కు రావడం జరిగింది. నా ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీగా రాజమండ్రికి వచ్చాను. నా కాలేజ్ చదువు అయిపోగానే మధ్యలో ఏ ఉద్యోగం చేయలేదు. సివిల్స్ రాసి ఏఎస్పీ అయ్యాను. ఆ తర్వాత విజయవాడ ఏఎస్పీగా, దాని తర్వాత అడిషినల్ ఎస్పీగా గుంటూరులో చేశాను. నాలుగు పెద్ద జిల్లాలు విజయవాడ సహా కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, కర్నూలు, ఖమ్మంకు ఎస్పీగా పని చేశాను. నేను పని చేస్తున్న సమయంలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉండేది. పోలీసు అధికారులపై నక్సల్స్ దాడులు చేయడం అప్పుడే మొదలైంది’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News