మంత్రి కేటీఆర్: జ్యోతిబసు రికార్డ్ ను కేసీఆర్ తిరగరాస్తారనే నమ్మకం నాకుంది: మంత్రి కేటీఆర్
- టీఆర్ఎస్ లో చేరిన వాళ్లకు సముచిత గౌరవం ఇస్తాం
- ఢిల్లీ వాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్ నేతలు
- వారికి పరాభవం తప్పదన్న కేటీఆర్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా నాడు సుదీర్ఘ పాలన అందించిన వామపక్ష నేత జ్యోతిబసు గురించి మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. నాడు సీఎంగా జ్యోతిబసు నెలకొల్పిన రికార్డ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ తిరగరాస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్ సమక్షంలో భూపాలపల్లి టీడీపీ నేత గండ్ర సత్యనారాయణ, హుస్నాబాద్, మంథని, సిరిసిల్ల టీడీపీ ఇన్ చార్జ్ లు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తమ పార్టీలో చేరిన వాళ్లకు సముచిత గౌరవం ఇస్తామని, ఢిల్లీ వాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పరాభవం తప్పదని అన్నారు.