టీపీసీసీ చీఫ్ ఉత్తమ్: రాబోయే కాలం కాంగ్రెస్ దే: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- ‘కాంగ్రెస్’లో చేరిన మెదక్ జిల్లాకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు
- కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబానికి తప్పా, ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు
- మా పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తాం: ఉత్తమ్
రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల ఆశలను కేసీఆర్ అడియాశలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబానికి తప్పా, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.