‘రుద్రమదేవి’: 'అలా ప్రశ్నించడం తప్పా...?’ అంటున్న ‘రుద్రమదేవి’ దర్శకుడు గుణశేఖర్!
- ‘రుద్రమదేవి’ చిత్రానికి అవార్డు దక్కకపోవడాన్ని ప్రశ్నించిన గుణశేఖర్
- మూడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఏ ఒక్క దానికి ఎంపిక కాలేకపోయింది!
- కనీసం, జ్యూరీ గుర్తింపునకు సైతం నోచుకోలేకపోయిందా?
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో ‘రుద్రమదేవి’ చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలో అవార్డు దక్కలేదు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు గుణశేఖర్ స్పందిస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రశ్నించడం తప్పా?...’ అంటూ చేసిన ఆ ట్వీట్ లో పలు ప్రశ్నలు సంధించారు. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’..మూడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఏదో ఒక దానికి ఎంపిక కాలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని మండిపడ్డారు.