జగన్: దొంగ మాటలు చెబుతూ సాధ్యం కాని హామీలిస్తున్న జగన్: మంత్రి ఆదినారాయణ రెడ్డి
- జగన్ కి పదవి పిచ్చి పట్టుకుంది
- ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు
- విమర్శలు గుప్పించిన మంత్రి ఆదినారాయణరెడ్డి
జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఇస్తున్న హామీలు అమలు కావాలంటే, తాను దాచిన సొమ్మంతా బయటకు తీయాల్సి ఉంటుందని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ చెబుతున్నవన్నీ దొంగమాటలని, సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ కు పదవి పిచ్చి పట్టుకుందని, అందుకే, దొంగమాటలు, సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు.