బాలయ్య: 'లెజెండ్' బాలయ్యను అభినందించిన మహిళా ఎమ్మెల్యేలు
- ‘లెజెండ్’ కు అవార్డులపై టీడీపీ మహిళా ఎమ్మెల్యేల హర్షం
- ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న బాలకృష్ణ
- ఈ సందర్భంగా బాలయ్యను అభినందించిన మహిళా నేతలు
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ చిత్రానికి నంది అవార్డుల పంట పండిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణను టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అభినందించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలయ్యను పలువురు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అభినందించి..ఆయనతో ఓ ఫొటో దిగారు. కాగా, ‘లెజెండ్’కు ఎక్కువ అవార్డులు రావడంపై బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ‘నంది’ అవార్డులు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.