Vidya Balan: వివాహం అనేది పిల్లల్ని కనేందుకు మాత్రమే..!: విద్యాబాలన్

  • వివాహం పునరుత్పత్తి కోసమేనన్న బాలీవుడ్ నటి
  • ‘సాన్నిహిత్యం’లోని ఆనందాన్ని కోల్పోతున్నారని ఆవేదన
  • ఆ విషయం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్య

బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ వివాహానికి సరికొత్త అర్థం చెప్పింది. పునరుత్పత్తి కోసమే వివాహమని, అదే భారతీయ సంస్కృతి అని పేర్కొంది. సాన్నిహిత్యంలోనే ఆనందం ఉందని వివరించింది. సెక్స్ అనేది ఓ భావన మాత్రమేనని, అది చర్యకాదనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని పేర్కొంది. ఇంత పెద్ద భారతదేశంలో ఇప్పటికీ సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘వివాహం ద్వారానే లైంగిక వాంఛలు తీర్చుకోవాలని భారతీయ సంస్కృతి చెబుతోంది. దీని ఉద్దేశం పునరుత్పత్తే. అయితే ‘సాన్నిహిత్యం’లోని ఆనందాన్ని చాలామంది కోల్పోతున్నారు’’ అని వివరించింది. ‘కృపయా ధ్యాన్ దే’ సిరీస్ కోసం ‘టాబూ’ పేరుతో ఓ వీడియోను చిత్రీకరించిన సందర్భంగా విద్యాబాలన్ ఈ వ్యాఖ్యలు చేసింది.

More Telugu News