సమంత: చిరునవ్వు లేని నా ఫొటో చూసి ఆశ్చర్యపోయా: నటి సమంత

  • ఆ ఫొటోను ‘ఇన్ స్టా గ్రామ్’ లో పోస్ట్ చేసిన సమంత
  • మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన వేడుకలో ఫొటో ఇది!
  • చిరునవ్వు లేకుండా ప్లాస్టర్ వేసుకున్నానంటున్న నటి

నాగచైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న గోవాలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నైలో ప్రత్యేక విందు ఏర్పాటు, అక్కినేని-దగ్గుబాటి కుటుంబాలు సరదాగా చేసుకున్న పార్టీలు, మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్ తెలిసిందే. ఈ వేడుకకు సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా సమంత పోస్ట్ చేయడం విదితమే. ఆ ఫొటోలన్నింటిలో చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉన్న సమంత, ఓ ఫొటోలో మాత్రం ‘స్మైల్ లెస్ ఫేస్’తో ఉంది. ఆ ఫొటోను సమంత తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి తనదైన శైలిలో తన గురించి కామెంట్ చేసుకుంది. ‘.. నా ముఖంలో చిరునవ్వు లేకుండా ప్లాస్టర్ వేసుకున్న ఉన్న ఫొటో ఇదీ..ఆశ్చర్యపోయా!!’ అని ఆ పోస్ట్ లో సమంత పేర్కొంది.

  • Loading...

More Telugu News