రోజా: పడవ ప్రమాదానికి.. చంద్రబాబునాయుడు షూ వేసుకోవడానికి ముడి పెట్టిన రోజా!
- చంద్రబాబు షూ ధరించే కృష్ణా హారతిలో పాల్గొన్నారు
- అందుకే, పడవ ప్రమాదం జరిగింది
- నాడు గోదావరి పుష్కరాలప్పుడు షూ ధరించే స్నానం చేశారు
- అప్పుడు 29 మంది చనిపోయారు: రోజా వ్యాఖ్యలు
విజయవాడలోని ఫెర్రీ వద్ద మూడు రోజుల క్రితం జరిగిన పడవ ప్రమాదానికి .. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు షూ వేసుకోవడానికి వైసీపీ నేత రోజా ముడిపెట్టారు. బాలల దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా నగరిలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు షూతో పాటే కృష్ణా హారతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే ఈ దురదృష్ట సంఘటన జరిగిందని వ్యాఖ్యానించారు.
గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా చంద్రబాబు షూ తోనే పుష్కర స్నానం చేశారని, అప్పుడు తొక్కిసలాట జరిగి, 29 మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనే ముందు చంద్రబాబు తాను ధరించిన షూను విప్పాలని లేదా పూజా కార్యక్రమాలు చేయడమన్నా మానుకోవాలని రోజా సూచించారు.