సమంత: తన పెళ్లి నుంచి వేడుకల వరకూ ప్రస్తావించిన నటి సమంత!
- ‘ఇన్ స్టా గ్రామ్’లో ఫొటోలు పోస్ట్ చేసిన సమంత
- 40 రోజుల్లో మొత్తం 100 వేడుకలు జరిగాయన్న నటి
- ఈ పోస్ట్ పై నెటిజన్ల ప్రశంసలు
నాగచైతన్యతో తన వివాహం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన వేడుకల గురించి సమంత ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి ఫొటోలను తన ఇన్ స్టామ్ గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘వెడ్డింగ్ సీన్ పూర్తయింది. 40 రోజుల్లో మొత్తం 100 వేడుకలు జరిగాయి. ఈ అందమైన దుస్తులు ధరించి చాలా ఎంజాయ్ చేశా’ అని సమంత తన పోస్ట్ లో పేర్కొని ఓ ఫొటోను జతపరిచింది. కాగా, ఈ పోస్ట్ పై ‘నైస్’, ‘ప్రిన్సెస్ లా ఉన్నారు’, ‘వావ్...నెమలిని తలపిస్తున్నారు’, ‘క్యూట్’ అని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.