సైనా నెహ్వాల్: ప్రముఖ షట్లర్ సైనాకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక కానుక!

  • తమ సంస్థ ‘నుష్’కు చెందిన దుస్తులను కానుకగా పంపిన అనుష్క
  • ఈ కొత్త దుస్తులను త్వరలోనే ధరిస్తా
  • ‘ట్విట్టర్’లో పేర్కొన్న సైనా నెహ్వాల్

సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ షిప్ లో ఇటీవల విజయం సాధించిన ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ కు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక కానుక పంపింది. ‘నుష్’ పేరుతో టెక్స్ టైల్ వ్యాపారరంగంలోకి అనుష్క అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమ సంస్థకు చెందిన కొన్ని వస్త్రాలను అందమైన ప్యాక్ లో ఉంచి వాటిని కానుకగా సైనాకు పంపింది. ఈ విషయాన్ని సైనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ‘అనుష్క శర్మకు ధన్యవాదాలు. ఈ దుస్తులను త్వరలోనే ధరిస్తా. ‘నుష్’ సంస్థ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మీకు శుభాకాంక్షలు’ అని సైనా తన ట్వీట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News