ఐ.ఇ.బి.ఎఫ్: 17న లండన్ లో ‘జనసేన’ అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు

  • ఐ.ఇ.బి.ఎఫ్ ‘గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు’ను అందుకోనున్న పవన్
  • 17న లండన్ లో అవార్డు ప్రదానం 
  •  లండన్ లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరు  

‘జనసేన’ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. ఇండియా, యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఐ.ఇ.బి.ఎఫ్)  ‘గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు’ ను పవన్ కు ప్రదానం చేయనుంది. ఈ నెల 17న లండన్ లో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నట్టు ‘జనసేన’ మీడియా హెడ్ పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆ అవార్డు స్వీకరించే నిమిత్తం ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం పవన్ లండన్ చేరుకుంటారని తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో లండన్ లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారని, ఆయన పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఐ.ఇ.బి.ఎఫ్ నిర్వాహకులు, యూరోప్ లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు, లండన్ లోని తెలుగువారు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News