ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్: మంచి పాత్రలే ఎంచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్

  • రజనీకాంత్ కలిసి నటించిన నాటి చిత్రం ‘ఆతంక్ హీ ఆతంక్’ ను గుర్తుచేసుకున్న ఆమిర్
  • ఈ సినిమాలో నేను బాగా నటించలేదు
  • ఇకపై మంచిపాత్రలను ఎంచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తాను ప్రధాన పాత్రల్లో నటించిన నాటి చిత్రం ‘ఆతంక్ హీ ఆతంక్’ తర్వాత మంచి పాత్రలను మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హాలీవుడ్ సినిమా ‘గాడ్ ఫాదర్’ కు రీమేక్ ‘ఆతంక్ హీ ఆతంక్’ చిత్రమని చెబుతూ, బాక్సాఫీసు వద్ద పరాజయం పాలై, తీవ్రమైన నిరాశకు గురి చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

 ఈ సినిమా పరాజయం పాలవడంతో తాను చాలా బాధపడ్డానని, దాదాపు నాలుగు వారాల పాటు సరిగా నిద్ర కూడా పోలేదని, అసలు, ఈ సినిమాలో నటించకుండా ఉంటే బాగుండేదేమోనని అప్పుడు అనిపించిందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో తాను బాగా నటించలేదని అనిపించిందని, ఇకపై మంచిపాత్రలను మాత్రమే ఎంచుకోవాలని తనకు అప్పుడే అనిపించిందని ఆమిర్ చెప్పారు.

  • Loading...

More Telugu News