దర్శకుడు రాజమౌళి: ఎంతో ప్రత్యేకం ఈ డ్యాన్స్ .. చాలా గొప్పగా చేశారు!: దర్శకుడు రాజమౌళి ప్రశంసలు
- ‘స్టార్ ప్లస్’లో ‘డ్యాన్స్ ఛాంపియన్’లో ‘జియోరే బాహుబలి’ పాట
- ‘కింగ్స్ యునైటెడ్ జట్టు’ అద్భుత ప్రదర్శన
- మంత్రముగ్ధుడైన రాజమౌళి ప్రశంసలు
‘స్టార్ ప్లస్’లో ‘డ్యాన్స్ ఛాంపియన్’ పేరుతో ఓ షో వస్తుంది. ఈ షోలో పాల్గొన్న ‘కింగ్స్ యునైటెడ్ జట్టు’ ‘బాహుబలి 2’లోని ‘జియోరే బాహుబలి’ పాటకు తమ దైన శైలిలో డ్యాన్స్ చేశారు. మంత్ర ముగ్ధుల్ని చేసేలా ఉన్న ఈ డ్యాన్స్ ను తిలకించిన న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. నిలబడి చప్పట్లు కొడుతూ ఆ కళాకారుల గొప్పతనాన్ని ప్రశంసించారు.
ఈ డ్యాన్స్ ను ‘బాహుబలి’ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా తిలకించారు. 'ఈ షో అద్భుతం' అంటూ ఆ షోకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇప్పటి కళాకారులు చేస్తున్న డ్యాన్స్, వారి స్టెప్పులు అద్భుతం. కానీ, ఎన్నో భావోద్వేగాలతో నిండిన ఈ డ్యాన్స్ ఎంతో ప్రత్యేకం. చాలా గొప్పగా చేశారు!!’ అని తన ట్వీట్ లో రాజమౌళి ప్రశంసించారు. ఆ వీడియో మీ కోసం!