కేసీఆర్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి .. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
- సాయాగౌడ్ పేరు రికార్డుల్లో ఉంది.. సాయం అందట్లేదు
- అమరవీరులకు సాయంపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలి
- లేఖలో కోరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయాగౌడ్ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నట్టు రికార్డుల్లో ఉందని, ఆయనకు సాయం చేసే విషయమై ప్రభుత్వానికి నిజామాబాద్ కలెక్టర్ నివేదిక సమర్పించినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విషయమై అసెంబ్లీలో ఒకరోజు చర్చ నిర్వహించాలని రేవంత్ తన లేఖలో కోరారు.