: 'ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా..!?'
కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ నిప్పులు చెరిగారు. దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ ను బర్తరఫ్ చేయాలని కోడెల డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ మనీలాండరింగ్ కుంభకోణంలో అడ్డంగా బుక్కవడం పట్ల వ్యాఖ్యానిస్తూ, కేంద్రంలో లక్షలు కోట్లు దోచుకుంటుంటే, వారిని చూసి రాష్ట క్యాబినెట్లోనూ దొంగలు తయారయ్యారని విమర్శించారు. 'ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా..!?' అని ఎద్దేవా చేశారు.