నిజామాబాద్: నిజామాబాద్ లో దారుణం.. దళిత యువకులపై బీజేపీ నాయకుడి ప్రతాపం!

  • చెరువు నుండి మట్టి అక్రమంగా తరలింపు
  • ఈ దందాకు పాల్పడుతున్న బీజేపీ నాయకుడు భరత్ రెడ్డి 
  • అడ్డుకున్న దళిత యువకులు
  • దుర్భాషలాడి..చెరువులో మునగమంటూ హెచ్చరించిన వైనం

దళిత యువకులను దూషిస్తూ వారి పట్ల అవమానకర రీతిలో బీజేపీ నాయకుడి ప్రవర్తించిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు..  నవీపేట్ మండలంలోని అబంగాపట్టమ్ లో చెరువు నుండి మట్టిని అక్రమంగా తరలించే దందాకు బీజేపీ నాయకుడు భరత్ రెడ్డి పాల్పడుతున్నాడు.

దీనిని దళిత యువకులు లక్ష్మణ్, రాజేశ్వర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, ఆ యువకులపై భరత్ రెడ్డి రెచ్చిపోయారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చేతిలో ఓ కట్టెను పట్టుకుని నిలబడి, అక్కడే ఉన్న చిన్నపాటి చెరువులో వారిని మునగమంటూ హెచ్చరించారు. అయితే, ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. కాగా, ఈ సంఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఆటవికంగా ప్రవర్తించిన భరత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News