చిరంజీవి: వీరాభిమానికి ‘మెగా’ సర్ప్రైజ్.. ఇంటికి పిలిచి విందు ఇచ్చిన చిరంజీవి!

  • చిరంజీవి ఫ్లెక్సీ ముందు ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ వీరాభిమాని
  • ఆ అభిమానిని ఆశ్చర్యపరిచిన చిరంజీవి
  • నవ దంపతులను తన ఇంటికి ఆహ్వానించి.. విందు ఇచ్చిన మెగాస్టార్!
  • సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు

మెగాస్టార్ చిరంజీవి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, దాని ముందు కూర్చుని ఇటీవలే తన వివాహాన్ని చేసుకున్న వీరాభిమాని ఆకుల భాస్కరరావుని చిరు సర్ ప్రైజ్ చేశారు. ఆ నూతన దంపతులను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి.. వారితో కలసి భోజనం చేశారు. అంతేకాదు, నవదంపతులకు కొత్త దుస్తులను కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. తాను అభిమానించే నటుడే స్వయంగా తమను ఆహ్వానించి.. విందు ఇవ్వడంతో ఆ వీరాభిమాని ఆనందానికి హద్దులు లేవు. కాగా, ‘రంగస్థలం’ సెట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కూడా ఈ దంపతులు కలిశారు. చెర్రీ వారితో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి.
 

  • Loading...

More Telugu News