సినీ నటి చార్మి: ‘మిస్సింగ్ మై బేబీస్’ అంటున్న సినీ నటి చార్మి!

  • తన పెంపుడు జంతువుల ఫొటోలను పోస్ట్ చేసిన చార్మి
  • వాటిని వదిలి ఉండలేకపోతోందట 
  • ‘మెహబూబా’ షూటింగ్ లో చార్మీ బిజీబిజీ

సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉండే ప్రముఖ సినీ నటి చార్మి కౌర్, తాజాగా, ‘ఫేస్ బుక్’ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. తన పెంపుడు జంతువులపై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా చార్మి వ్యక్తం చేసింది. ‘మిస్సింగ్ మై బేబీస్. వాటిని చూడకుండా ఉండలేకపోతున్నా’ అని పేర్కొంది. ఈ సందర్భంగా తన పెంపుడు జంతువులతో దిగిన నాటి ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాష్  హీరోగా రూపొందిస్తున్న ‘మెహబూబా’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం పంజాబ్ లో ఉండటంతో తన పెంపుడు జంతువులను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయాన్ని చార్మి తన పోస్ట్ ద్వారా చెప్పడం గమనార్హం.


  • Loading...

More Telugu News