కలెక్టర్ గా నయనతార అదరగొట్టేసిందట .. లేడీ సూపర్ స్టార్ అంటూ టాక్!

నయనతార తాజా చిత్రంగా తమిళంలో 'అరమ్' అనే సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో 'అరమ్' అనే మాటకి న్యాయం చేయండి .. ధర్మం చేయండి వంటి అర్థాలు వస్తాయి. గోపీ నయనార్ తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది.  కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాలో, ప్రజల కష్టాలను రాజకీయ నాయకుల ముందుంచి ప్రశ్నించే కలెక్టర్ పాత్రలో నయనతార నటించింది.

 గ్రామాల్లో త్రాగునీరుతో పాటు కనీస వసతులు కల్పించాలని ప్రజల తరఫున నిలిచి పోరాడే పాత్రలో ఆమె నటన అద్భుతం అనేస్తున్నారు. విమర్శకులు సైతం ఆమె నటనపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా తరువాత నయనతార 'లేడీ సూపర్ స్టార్' అని పిలిపించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథా కథనాలు .. టేకింగ్ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. త్వరలో 'కర్తవ్యం' పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.    


More Telugu News