జగన్: జగన్ రాసిన స్క్రిప్ట్ ను రోజా చదువుతోంది: టీడీపీ నేత బుద్దా వెంకన్న

  • ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీకి వస్తామని రోజా అనడం విడ్డూరం
  • అసలు, రోజాకు రాజకీయ ఓనమాలు తెలుసా?
  • ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ రాజశేఖరరెడ్డే
  • మీడియాతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

వైసీపీ అధినేత జగన్ రాసిన స్క్రిప్ట్ ను ఎమ్మెల్యే రోజా చదువుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీకి వస్తామని రోజా అనడం విడ్డూరంగా ఉందని, అసలు, రోజాకు రాజకీయ ఓనమాలు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.

ఫిరాయింపులను ప్రోత్సహించింది, ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ రాజశేఖరరెడ్డేనని వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై జగన్ చర్చకు రావాలని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఒక్క ఎంపీతో అయినా రాజీనామా చేయించావా? అని ఆమెను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సిన జగన్, పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

  • Loading...

More Telugu News