‘జబర్దస్త్’: యాంకర్ సుమ నా పేరు మార్చేశారు!: ‘జబర్దస్త్’ నటుడు శాంతి స్వరూప్
- నా అసలు పేరు శాంతి కుమార్
- నాడు ‘కెవ్వుకేక’లో పాల్గొనేందుకు వెళ్లా
- అప్పుడు, యాంకర్ సుమ నా పేరే మార్చేశారు
తన అసలు పేరును మార్చింది యాంకర్ సుమ అని ‘జబర్దస్త్’లో స్త్రీ పాత్రలు పోషించే నటుడు శాంతి స్వరూప్ అన్నారు. ‘ఐడ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా అసలు పేరు శాంతి కుమార్. అయితే, యాంకర్ సుమ గారు డైరెక్షన్ చేసిన ‘కెవ్వుకేక’ షోలో నేను పాల్గొన్నా. ‘దూరదర్శన్’లో శాంతి స్వరూప్ అనే వ్యాఖ్యాత ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. నువ్వు కూడా నవ్వుతూనే ఉన్నావు కాబట్టి.. నీ పేరు శాంతి స్వరూప్’ అని అప్పుడు అన్నారు. దీంతో, నా పేరు శాంతి స్వరూప్ గానే స్థిరపడిపోయింది. ఓ టాప్ యాంకర్ , అందులోనూ నాకు ఇష్టమైన యాంకర్ సుమ గారు నా పేరు మార్చడం నాకు కూడా నచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.