తమ్మినేని: చంద్రబాబుకు దమ్ముంటే జగన్ సవాల్ ని స్వీకరించాలి: వైసీపీ నేత తమ్మినేని
- ఆరోపణలు రుజువు చేయని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేయాలి
- సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాబుపై ఉంది
- ఇష్టానుసారం ఆరోపిస్తే కుదరదు
- పాత్రికేయులతో తమ్మినేని సీతారాం
చంద్రబాబుకు దమ్ముంటే జగన్ చేసిన సవాల్ ని స్వీకరించాలని వైసీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చేసిన ఆరోపణలు రుజువు చేయలేని పక్షంలో చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసత్య ఆరోపణలపై స్పందించాలని టీడీపీకి తాము గడువిచ్చినప్పటికీ ఆ పార్టీ నాయకులు స్పందించలేదని అన్నారు.
చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, ఇష్టానుసారం ఆరోపిస్తే తగదని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఫిరాయింపులను నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.