: 'చిరు' భక్తుడికి కొండ్రు హితోపదేశం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవే అని స్వామి భక్తి చాటుకున్న మంత్రి సి.రామచంద్రయ్యకు సహచరమంత్రి కొండ్రు మురళి హితవు పలికారు. ముఖ్యమంత్రి ఎవరన్న విషయం అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. సీఎం ఎవరన్న విషయం పక్కనబెట్టి, ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి పెడితే సబబుగా ఉంటుందని కొండ్రు సలహా ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని రామచంద్రయ్యకు సూచించారు.