: మా అబ్బాయి పెళ్ళిలో వితంతువుల చేత అక్షింతలు వేయిస్తా: అక్కినేని అమల


వితంతువులను చిన్న చూపు చూడకూడదనీ, వారిని కూడా మనతో మమేకం చేసుకోవాలనీ సినీ నటి అక్కినేని అమల విజ్ఞప్తి చేశారు. తన కుమారుడి పెళ్ళిలో వితంతువుల చేత దంపతులకు అక్షింతలు వేయిస్తానని ఆమె చెప్పారు. 'సమాజంలో వితంతువులకు సమానత' అనే అంశంపై బాలవికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కాజీపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి మహిళా సభలో పాల్గొన్న అమల ఆవేశపూరితంగా మాట్లాడారు.

తరతరాలుగా వితంతువుల పట్ల మన సమాజంలో వివక్ష చూపుతున్నారనీ, ఇది శోచనీయమనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వితంతువులకు బొట్టు, గాజులు తీసివేయడం, వారిని అపశకునంగా భావించడం ... ఇవన్నీ మూఢనమ్మకాలని అమల విమర్శించారు. వీటిని అధిగమించి, సమాజం వారిని కూడా సమానంగా చూడగలగాలని ఆమె కోరారు.   

  • Loading...

More Telugu News