ఎన్ఈసీసీ: ఎన్ఈసీసీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా నటుడు షాయాజీ షిండే
- కోడిగుడ్డులో పోషకాలు బాగా ఉంటాయని గమనించా
- అందుకే, బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించా
- దేశంలో ఎంతో మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు
- మీడియాతో మాట్లాడిన షాయాజీ షిండే
ప్రతి నాయకుడిగా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో తనదైన శైలిలో నటించే నటుడు షాయాజీ షిండే నేషనల్ ఎగ్ కోఆర్డినేటర్ కమిటీ (ఎన్ఈసీసీ)కి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్ఈసీసీ ప్రతినిధులు ఇటీవలే తనను కలిశారని, కోడిగుడ్డులో పోషకాలు బాగా ఉంటాయనే విషయాన్ని గమనించడంతోనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు తాను అంగీకరించినట్టు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తి, పోషకాలు కోడిగుడ్డు ద్వారా లభిస్తాయని ఆయన అన్నారు. దేశంలో ఎంతో మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.