నాగార్జున: నా పిల్లల ఆనందానికి మించి నాకు ఇంకేమీ అక్కర్లేదు!: నాగార్జున

- నాగచైతన్య, అఖిల్ లు వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు చాలా కష్టపడుతున్నారు
- సినిమాల విషయంలో మేము ముగ్గురం పోటీ పడుతుంటాం
- ఓ ఇంటర్వ్యూలో ‘కింగ్’ నాగార్జున
తన పిల్లల ఆనందం కన్నా తనకు ఇంకేమీ అక్కరలేదని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాగ చైతన్య, అఖిల్ లు నాగార్జున కుమారులు అనే దాని నుంచి బయటపడి, వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు చాలా కష్టపడుతున్నారని అన్నారు.సినిమాల పరంగా చూస్తే నాగచైతన్య, అఖిల్, తాను పోటీ పడుతుంటామని నవ్వుతూ చెప్పారు.
ఇక, తన సినీ కెరీర్ గురించి నాగార్జున ప్రస్తావిస్తూ, ముప్పై ఏళ్లుగా తాను నటిస్తూనే ఉన్నానని అన్నారు. తాను నటించిన చిత్రాల్లో అసంతృప్తి నిచ్చినవి కూడా ఉన్నాయని, అయితే, అలాంటివి కనుక లేకపోతే జీవితం కొంచెం బోరింగ్ గా ఉంటుందని నాగ్ చెప్పుకొచ్చారు.