ధోనీ: దుబాయ్ లో ధోనీ క్రికెట్ అకాడమీ..ఈ నెల 11న ప్రారంభం
- దుబాయ్ లో ‘ద మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అకాడమీ’
- ధోనీతో కలిసిన ‘పసిఫిక్ వెంచర్స్’
- 11న ధోనీ చేతుల మీదుగా ప్రారంభం
ఈ నెల 11న దుబాయ్ లో ‘ద మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అకాడమీ’ ప్రారంభం కానుంది. దుబాయ్ కు చెందిన ‘పసిఫిక్ వెంచర్స్’ తో కలిసి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘పసిఫిక్ వెంచర్స్’ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్ మాట్లాడుతూ, ధోనీతో కలిసి పని చేయనుండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ అకాడమీని 11వ తేదీన ధోనీ ప్రారంభించనున్నాడని చెప్పారు.
యూఏఈలో క్రికెట్ ను ప్రోత్సహించే క్రమంలో భాగంగా ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్ లో దక్షిణాఫ్రికా, యూకేలకూ తమ అకాడమీలను విస్తరించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఈ నెల 12న పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లతో తమ అకాడమీలోని ఆటగాళ్లకు ముఖాముఖి కార్యక్రమాన్ని ధోనీ నిర్వహించనున్నట్టు చెప్పారు.