కోహ్లీ: కోహ్లీ మధ్యాహ్న భోజనంలో కాల్చిన కోడి మాంసం ఉండాల్సిందేనట!
- మూడు పూట్ల తీసుకునే తన ఆహారం గురించి చెప్పిన కోహ్లీ
- ఉదయం పూట ఆమ్లెట్, ఆకుకూరలు, చేపలు..
- మధ్యాహ్న భోజనంలో కాల్చిన కోడి మాంసం, వేయించిన బంగాళదుంపలు..
- రాత్రుళ్లు కేవలం చేపలతో వండిన ఆహారం
బరిలోకి దిగితే తన బ్యాట్ సత్తాతో పరుగులు కురిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు మారుపేరు. ఎంతో ఫిట్ గా కనిపించే కోహ్లీ ఆహారం విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తాడు. తాను మూడు పూటలా తీసుకునే ఆహారం గురించి కోహ్లీయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే..
ఉదయం: మూడు కోడి గుడ్లలోని తెల్ల సొనతో, ఒక పూర్తి గుడ్డుతో వేసిన ఆమ్లెట్, చీజ్, చేపలు, ఆకుకూర, బొప్పాయి, పుచ్చకాయ
మధ్యాహ్నం: కాల్చిన కోడిమాంసం, ఆకుకూరలు, ఉడికించిన కూరగాయలు, వేయించిన బంగాళదుంపలు
రాత్రి: చేపలతో వండిన ఆహారం మాత్రమే తీసుకుంటానని ఆ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పాడు.