ఇస్రో చైర్మన్: షార్ సేవలను ప్రశంసిస్తూ ఇస్రో చైర్మన్‌కు చంద్రబాబు లేఖ!
- నైరుతి రుతు పవనాల సమయంలో ఇస్రో సమాచారం
- వరదల సమాచారం ముందస్తు చర్యలకు ఉపకరించింది
- భవిష్యత్ లో ఇస్రోతో మరింత భాగస్వామ్యంతో పని చేసే ఆసక్తి ఉంది: చంద్రబాబు
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఇస్రో చైర్మన్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఓ లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల సమయంలో ఇస్రో అందించిన వరదల సమాచారం ముందస్తు చర్యలకు ఉపకరించిందని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇస్రోతో మరింత భాగస్వామ్యంతో పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.