కమల్: కమల్, పవన్ లు ముఖ్యమంత్రులైతే బాగుంటుంది: సీనియర్ నటుడు నరేశ్
- ఓ ట్వీట్ చేసిన నరేశ్
- లక్షలాది అభిమానులు, ప్రజలు కలలుగంటున్నారు
- అదేకనుక జరిగితే ఎంజీఆర్, ఎన్టీఆర్ శకం మళ్లీ చూడొచ్చు
ప్రముఖ నటులు కమలహాసన్, పవన్ కల్యాణ్ గురించి సీనియర్ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలహాసన్, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రులు కావాలని లక్షలాది మంది అభిమానులు, ప్రజలు కలలుగంటున్నారని నరేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఒకవేళ కమల్, పవన్ లు ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయితే నందమూరి తారకరామారావు, ఎంజీఆర్ ల శకాన్ని మళ్లీ చూడొచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ ట్వీట్ తో పాటు కమల్ తో కలిసి తాను దిగిన ఓ ఫొటోను నరేశ్ పోస్ట్ చేశారు. ఆ ఫొటోపై పవన్ నవ్వుతున్న చిన్నసైజ్ ఫొటో ఉండటం గమనార్హం. ఈ ట్వీట్ పై నెటిజన్లు, కమల్, పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సరైన సమయంలో తన సొంత పార్టీని ప్రకటిస్తానని కమలహాసన్ ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘జనసేన’ను స్థాపించిన పవన్ కల్యాణ్ పార్టీ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు.