కేసీఆర్: నయీమ్ లాంటి నర రూపరాక్షసుల సృష్టికర్తలు ఎవరో అందరికీ తెలుసు!: సీఎం కేసీఆర్

  • భూరికార్డుల ప్రక్షాళన అంశంపై అసెంబ్లీలో చర్చ
  • అమాయక ప్రజలను భయపెట్టి భూములను లాక్కున్న నయీమ్ 
  • ఇలాంటి నరరూపరాక్షసులను పెంచి పోషించిందెవరో అందరికీ తెలుసు: కేసీఆర్

నయీమ్ భూములనేవి ఏవీ లేవని, సాధారణ ప్రజలను భయపెట్టి ఆ భూములను నయీమ్ లాక్కున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన అంశంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, నయీమ్ లాంటి నర రూపరాక్షసుల సృష్టికర్తలు ఎవరో, అలాంటి వ్యక్తులను పెంచి పోషించింది ఎవరో, వాళ్ల ఆగడాలకు ఆజ్యం పోసిందెవరో ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి అన్నారు.

 నయీమ్ లాంటి వ్యక్తులు ఎవరి హయాంలో చెలరేగారో, ఎప్పుడు ఖతమయ్యారనే విషయం అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ‘ఇకపై దయచేసి, నయీమ్ భూములు’ అని అనకండి.. అని సభలో ఆయన సూచించారు. నయీమ్ అనే వ్యక్తి అమాయక ప్రజలను భయపెట్టి దౌర్జన్యంగా లాక్కున్న భూముల వివరాలు తమకు అందిన తర్వాత సభ ముందు ఉంచుతానని అన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ భూముల వ్యవహారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News