: టాస్ గెలిచి 'గేల్' కు బ్యాటింగ్ ఇచ్చారు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు మొదట ఆలోచించేంది విధ్వంసకారి క్రిస్ గేల్ గురించే. కానీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాత్రం టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ ఇచ్చింది. దీనికి కారణం స్వంత మైదానం మొహాలీలో మ్యాచ్ ఆడనుండడమే. తొలుత బ్యాటింగ్ అంటే గేల్ ఎలా ఆడతాడో, బౌలర్లకు ఎన్ని కడగళ్ళు మిగుల్చుతాడో తెలియందికాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పంజాబ్ వ్యూహకర్తలు తమ బౌలర్లపై నమ్మకముంచుతూ, మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పోరు మరికాసేపట్లో ఆరంభం కానుంది.