ఏసియన్ థియేటర్స్: తమ చిత్రానికి థియేటర్లు ఇవ్వడం లేదంటూ.. ఏసియన్ థియేటర్స్ అధినేతతో సినీ దర్శకుడు అజయ్ వాగ్వాదం!

  • ‘ఒక్కడు మిగిలాడు’కు థియేటర్ల కేటాయింపుపై వాగ్వాదం
  • డబ్బింగ్ సినిమాలకే ప్రాధాన్యమిస్తున్నారన్న అజయ్
  • రౌడీయిజం చూపిస్తే థియేటర్లు రావు
  • మీడియాతో ఏసియన్ థియేటర్స్ అధినేత సునీల్

హైదరాబాద్ లోని ఏసియన్ థియేటర్స్ అధినేత సునీల్ తో సినీ దర్శకుడు అజయ్ వాగ్వాదానికి దిగారు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాకు థియేటర్ల  కేటాయింపు విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. తమ చిత్రానికి థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, డబ్బింగ్ సినిమాలకే ప్రాధాన్యమిస్తున్నారని దర్శకుడు అజయ్ ఆరోపించారు.

కాగా, ఈ విషయమై సునీల్ మాట్లాడుతూ, వంద మందిని వెంటేసుకుని వచ్చి తనను బెదిరిస్తున్నారని అజయ్ పై ఆయన ఆరోపించారు. చాలా సినిమాలు విడుదలవుతున్నాయని, వాటికీ థియేటర్లు ఇవ్వాలని, రౌడీయిజం చూపిస్తే థియేటర్లు రావని మీడియాతో ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News