జగన్ పాదయాత్ర: ఈ రోజు రాత్రి వేంపల్లె క్రాస్ వద్ద వైఎస్ జగన్ బస!
- తొలిరోజు ముగిసిన వైఎస్ జగన్ పాదయాత్ర!
- ప్రస్తుతం వేంపల్లెలో జగన్
- వీరగడ్డపల్లి, కుమరం పల్లి మీదుగా సాగిన పాదయాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తొలిరోజు ముగిసింది. ఈ రోజు కడపలోని ఇడుపులపాయలో జగన్ పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ వేంపల్లెలో ఉన్నారు. ఈ రోజు రాత్రి వేంపల్లె క్రాస్ వద్ద జగన్ బస చేస్తారు. జగన్ వీరగడ్డపల్లి, కుమరంపల్లి మీదుగా పాదయాత్ర చేశారు. మోసం చేస్తోన్న టీడీపీ సర్కారుకి ప్రజలు బుద్ధి చెప్పాలని జగన్ అన్నారు. నైతిక రాజకీయాలపై టీడీపీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూ ఆయన తొలిరోజు పాదయాత్ర కొనసాగింది. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే వస్తుందని వైసీపీ నేతలు చెప్పుకున్నారు.