సమంత: అక్కినేని - దగ్గుబాటి కుటుంబాల సందడి! ఫొటోలు వైరల్!
- సరదాగా గడిపిన రెండు కుటుంబాలు
- ఈ వేడుకకు హాజరైన దగ్గుబాటి సురేష్, వెంకటేశ్, రానా
- సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు
నాగ చైతన్య - సమంతల వివాహం జరిగి నెలరోజులైంది. వివాహానంతరం నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నైలో విందు ఏర్పాటు చేయడం, పలువురు ప్రముఖులు హాజరుకావడం తెలిసిందే. హైదరాబాద్ లో కూడా ఓ విందు ఏర్పాటు చేస్తామని నాగార్జున గతంలో ప్రకటించారు. ఈ నెల 12న లేదా ఆ మరుసటి రోజున ఈ విందు కార్యక్రమం ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, నాగచైతన్య-సమంతల వివాహం తర్వాత అక్కినేని, దగ్గుబాటి కుటుంబం కలిసి సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి. ఈ వేడుకకు నాగచైతన్య తల్లి లక్ష్మి,నిర్మాత దగ్గుబాటి సురేష్, నటులు వెంకటేశ్, రానా తదితరులు హాజరయ్యారు.