ఐశ్వర్య రాయ్: ‘ఫన్నేఖాన్’ షూటింగ్ లో ఐశ్వర్యారాయ్ కు గాయాలు!

  • ముంబైలోని ఫ్లోరా ఫౌంటెన్ ప్రాంతంలో షూటింగ్
  • మోటార్ బైక్ శబ్దం వినిపించకపోవడంతో ప్రమాదం
  • ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూ గాయాలు
  • ఐశ్వర్యకు ప్రమాదమేమీ లేదని చెప్పిన వైద్యులు 

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఓ షూటింగ్ లో గాయపడ్డారు. ‘ఫన్నేఖాన్’ సినిమా షూటింగ్ లో బైక్ ఢీకొనడంతో  ఆమె గాయపడ్డట్టు సమాచారం. వెంటనే, ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. ఐశ్వర్యకు ప్రమాదమేమీ లేదని  సమాచారం.

కాగా, ముంబైలోని ఫ్లోరా ఫౌంటెన్ ప్రాంతంలో నిన్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఐశ్వర్యను సమీపిస్తున్న మోటార్ బైక్ శబ్దం ఆమెకు వినిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరా మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో ఐశ్వర్యతో పాటు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా గాయపడ్డాడని చెప్పారు. ఐశ్వర్య ప్రస్తుతం బాగానే ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News