kathri: తనకి పది అడుగుల దూరంలో ఉండమని అన్నయ్య అనేవాడు : కార్తీ
- అమ్మా నాన్న ఏం చెబితే అది చేసేవాడిని
- అన్నయ్య అందుకు పూర్తి విరుద్ధం
- నా బైక్ ను ఆయనే వాడేసేవాడు
తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో మాట్లాడిన కార్తీ, తనకీ .. సూర్యకి మధ్య జరిగిన అనేక సంఘటనలను గురించి చెప్పుకొచ్చాడు. " అమ్మా నాన్న ఏం చెబితే అది నేను చేసే వాడిని .. అన్నయ్య మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా చేసేవాడు. అలా చిన్నప్పటి నుంచి మా ఇద్దరి స్వభావాలు పూర్తి భిన్నంగా ఉండేవి .. నన్ను బాగా కొట్టేవాడు"
"ఇక ఇంటర్మీడియెట్ కి వచ్చాక అన్నయ్య కన్నా నేను హైట్ పెరిగాను. దాంతో "ఒరేయ్, నీకు నాకూ పది అడుగుల దూరం ఎప్పుడూ ఉండాలి" అని అన్నాడు. అప్పటి నుంచి నన్ను కమాండ్ చేసే విషయంలో తగ్గాడు. నేను మా మేనమామతో ఛాలెంజ్ చేసి అనుకున్న ర్యాంక్ ను తెచ్చుకున్నాను. దాంతో మాట ఇచ్చిన ప్రకారం మా మేనమామ నాకు బైక్ కొనిపెట్టాడు. ఆ బైక్ ను మా అన్నయ్యే ఎక్కువగా వాడేసేవాడు. కీ దాచిపెట్టేసినా కనుక్కుని కాజేసేవాడు. అలా కాలేజ్ డేస్ లోను ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉండేది" అంటూ చెప్పుకొచ్చాడు.