: సనావుల్లాను పరామర్శించిన పాక్ హైకమిషనర్
జమ్మూకాశ్మీర్ జైల్లో భారత మాజీ సైనికుడు వినోద్ కుమార్ చేతిలో తీవ్రంగా గాయపడిని పాకిస్తాన్ ఖైదీ సనావుల్లా రంజాయ్ ను నేడు పాక్ హైకమిషనర్ సల్మాన్ బషీర్ పరామర్శించారు. సనావుల్లా చండీగఢ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేడు సనావుల్లాను సందర్శించిన బషీర్ మీడియాతో మాట్లాడుతూ.. అతను బతికే అవకాశాలు మృగ్యమని పేర్కొన్నారు. సనావుల్లా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. అతన్ని పాక్ పంపించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. అతని కుటుంబ సభ్యులను భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని బషీర్ వివరించారు.
కాగా, సనావుల్లా జీవక్రియలు క్రమేపీ మెరుగుపడుతున్నాయని ఆసుపత్రి వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. అతనింకా వెంటిలేటర్ పైనే ఉన్నాడని వారు తెలిపారు.