జగ్గారెడ్డి: కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ముందస్తు అరెస్టు!

  • మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటానన్న జగ్గారెడ్డి
  • సంగారెడ్డిలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • స్థానిక అవసరాలకు సింగూరు జలాలను విడుదల చేయాలని డిమాండ్

తెలంగాణ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. జగ్గారెడ్డి నివాసంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకుని స్థానిక ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా, సింగూరు జలాలను స్థానిక అవసరాలకు ఉపయోగించకుండా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు విడుదల చేయడంపై జగ్గారెడ్డి మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీష్ రావును అడ్డుకుంటామని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News