జగన్: కడప గండి ఆంజనేయస్వామిని దర్శిచుకున్న జగన్
- పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు
- తీర్థప్రసాదాలు స్వీకరించిన నేత
- అర్చకులతో ముచ్చటించిన జగన్
రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న వైసీపీ అధినేత జగన్ కడప గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం, ఆలయ అర్చకులతో జగన్ ముచ్చటించారు. అనంతరం, కడప దర్గాలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
కాగా, జగన్ తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని పలుచోట్ల ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. నగరి ఎమ్మెల్యే రోజా కూడా ప్రత్యేకపూజలు నిర్వహించారు. జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ నగరి దేశమ్మ ఆలయంలో మహిళలతో కలిసి 108 కుండలతో పొంగళ్లు వండించారు. ఈ విషయాన్ని రోజా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FRojaSelvamani.Ysrcp%2Fvideos%2F1078357172304308%2F&show_text=0&width=560" width="560" height="308" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>