అమలాపాల్: మూడు రకాల పోజుల్లో అమలాపాల్!

  • మూడు రకాల భావాలొలికిస్తూ ఫొటోలు
  • మహాకవి రవీంద్రుని సూక్తినీ పోస్ట్ చేసి అమలాపాల్
  • నెటిజన్ల భిన్న విమర్శలు

తన కొత్త కారుకు ఎక్కువ పన్ను చెల్లించకుండా ఉండేందుకు నకిలీ చిరునామాతో పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని వివాదాల్లో చిక్కుకున్న నటి అమలాపాల్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రకాల భావాలొలికిస్తూ దిగిన ఫొటోలను తన అభిమానులతో ఆమె పంచుకుంది.

అంతేకాకుండా, మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తిని కూడా పేర్కొంది. ‘మనకు చెందినది అయితే, వాటిని సొంతం చేసుకోగల శక్తి మనకు ఉంటే కనుక ప్రతిఒక్కటీ మన వద్దకు వస్తుంది’ అనే అర్థం వచ్చే సూక్తిని పేర్కొంది. కాగా, ఈ ఫొటోలను, ఆ సూక్తిని చూసిన నెటిజన్లు భిన్న విమర్శలు చేశారు. 

  • Loading...

More Telugu News