బ్రహ్మానందం: తెలుగు అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న బ్రహ్మానందం
- తెలుగు అకాడమీ 29వ వార్షికోత్సవంలో పురస్కార ప్రదానం
- సినీనటులు మురళీమోహన్, తనికెళ్ల భరణి, అలీ, సాయికుమార్, రవిబాబుకు ప్రతిభా పురస్కారాలు
- ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం
తెలుగు అకాడమీ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. తెలుగు అకాడమీ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సినీ నటులు మురళీమోహన్, అలీ, తనికెళ్ల భరణి, సాయికుమార్, రవిబాబు ప్రతిభా పురస్కారాలను అందుకున్నవారిలో ఉన్నారు. సామాజిక సేవలో గురుప్రసాద్, విద్యారంగం నుంచి రావూరి వెంకటస్వామి, వైద్య రంగంలో దశరథ రామిరెడ్డి, ఆర్థిక రంగంలో మహేశ్ వై. రెడ్డికి ఈ పురస్కారాలు దక్కాయి.