కమలహాసన్: పార్టీ ఏర్పాటు గురించి త్వరలో వెల్లడిస్తా: కమలహాసన్ వెల్లడి

  • పార్టీ స్థాపించి తీరుతా.. అభిమానులతో విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా
  • ఈ నెల 7న నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు
  • వరద బాధితులను ఆదుకునే లక్ష్యంగా పని చేయాలి
  • అభిమానులకు పిలుపునిచ్చిన కమల్

కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజకీయపార్టీ ఏర్పాటు గురించి త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ నటుడు కమలహాసన్ వెల్లడించారు. పార్టీ స్థాపించి తీరుతానని, దీని ఏర్పాటు, ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని కమల్ తన అభిమానులకు చెప్పారు. ఈ నెల 7వ తేదీన తన జన్మదినం సందర్భంగా అభిమానులెవ్వరూ వేడుకలు నిర్వహించవద్దని, వరద బాధితులను ఆదుకునే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

అభిమానులతో విభాగాల వారీగా 50 సమావేశాలు ఏర్పాటు చేస్తానని, నిరాడంబరంగా పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమల్ పేర్కొన్నారు. కాగా, రాజకీయ పార్టీ ఏర్పాటుపై కమల్ చేసిన ఈ ప్రకటనతో స్పష్టత వచ్చినట్టయింది. కమల్ రాజకీయ ప్రవేశంపై 6 నెలలుగా జోరుగా చర్చ సాగుతోంది.

  • Loading...

More Telugu News