గౌతమి: నా జీవితంలో మొట్టమొదటిసారి వీల్ చైర్ లో ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సి వచ్చింది: సినీ నటి గౌతమి
- నాటి సంఘటనను గుర్తుచేసుకున్న గౌతమి
- కేన్సర్ చికిత్స తర్వాత.. మ్యూజిక్ కాలేజ్ లో చేర్పించేందుకు శ్రుతిహాసన్ ని యూఎస్ తీసుకువెళ్లా
- నడిచే ఓపిక లేక చెన్నై ఎయిర్ పోర్ట్ కు వీల్ చైర్ లో వెళ్లా
- ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పిన గౌతమి
తన జీవితంలో మొట్టమొదటిసారి చెన్నై ఎయిర్ పోర్ట్ కు వీల్ చైర్ లో వెళ్లిన సందర్భాన్ని ప్రముఖ సినీ నటి గౌతమి ప్రస్తావించారు. ‘ఐ డ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడితే, ‘శ్రుతిహాసన్ కు పదిహేడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేను పెంచాను. శ్రుతిహాసన్ కాలేజ్ పూర్తయి, మ్యూజిక్ కాలేజ్ లో చేరే సమయంలో ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడే, నా కేన్సర్ ట్రీట్ మెంట్ కూడా పూర్తయింది. అప్పటికి 45 సైకిల్స్ ఆఫ్ రేడియేషన్ అయ్యాయి.
ఆ తర్వాత రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత శ్రుతిహాసన్ ని యూఎస్ లోని మ్యూజిక్ కాలేజీలో చేర్పించేందుకు వెళ్లా. అయితే, నాకు నడిచే ఓపిక లేకపోవడంతో చెన్నై ఎయిర్ పోర్టుకి వీల్ చైర్ లో వెళ్లాను. అలా వెళ్లడం నా లైఫ్ లోఫస్ట్ టైమ్. కమల్, నేను విడిపోవడానికి కారణం శ్రుతి హాసన్ కాదు. ఈ నిర్ణయం నేనే తీసుకున్నా. నా నిర్ణయాలకు నేను బాధ్యత తీసుకుంటా. ఈ నిర్ణయం వెనుక ఎవరి ప్రభావం లేదు’ అని గౌతమి అన్నారు.