: ఈ విషయం చెప్పినందుకు మన్నించండి... చాలా అవమానం కలిగింది: పీవీ సింధు
- నాకు బాధ కలిగింది
- ముంబైకి బయలుదేరితే అవమానం
- అజితేష్ అనే వ్యక్తి కారణం
- ఏమైందో మాత్రం ఇంకా చెప్పని సింధు
ముంబైకి వెళ్లేందుకు తాను ఈ ఉదయం బయలుదేరిన వేళ జరిగిన ఓ ఘటన తనకు చాలా బాధను కలిగించిందని బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విషయం చెబుతున్నందుకు మన్నించాలని, తనకు అవమానం జరిగిందని పేర్కొంది. తాను ఇండిగోకు చెందిన విమానం 6ఈ 608 ఎక్కాల్సి వుందని, గ్రౌండ్ స్టాఫ్ లో అజితేష్ అనే వ్యక్తి, తనను అవమానించాడని తెలిపింది. ట్విట్టర్ లో మూడు భాగాలుగా ఈ ట్వీట్ ఉందని చెబుతూ '1/3' అని మెసేజ్ చివర చూపుతోంది. సింధూ మరో రెండు భాగాలను పెట్టాల్సి వుంది. ఈ మెసేజ్ ఇప్పటికే వైరల్.