జగన్: జగన్ జైలు కెళ్లడం ఖాయం .. పాదయాత్ర చేసే అర్హత లేదు: టీడీపీ నేతలు

  • జగన్ పై విమర్శలు గుప్పించిన కళా వెంకట్రావు, వర్ల రామయ్య
  • పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు
  • ఏ1గా ఉన్న జగన్ ప్రజలకు ఏం చెబుతారు?

వైైసీపీ అధినేత జగన్ మళ్లీ జైలు కెళ్లడం ఖాయమని ఏపీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. జగన్ పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని, కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. మరో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, జగన్ అడ్డగోలు రాజకీయం చేస్తున్నారని, పాదయాత్రకు రక్షణ కావాలని అర్జీ పెడతారని.. పాదయాత్రకు అనుమతి మాత్రం అడగరని విమర్శించారు. చట్టాలను గౌరవించని జగన్ కు పాదయాత్ర చేసే అర్హత లేదని, సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ ప్రజలకు ఏం చెబుతారు? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News