: అటాక్ చేయడమే తనకిష్టమంటున్న తెలుగుతేజం
బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ తర్వాత ఎవరన్న ప్రశ్నకు తన అద్వితీయ ప్రదర్శనతో జవాబిస్తోన్న తెలుగుతేజం పీవీ సింధు. సింధు ఇటీవలే మలేసియా గ్రాండ్ ప్రీలో మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుని అంతర్జాతీయ యవనికపై సత్తా నిరూపించుకుంది. తన కెరీర్లోనే అతిపెద్ద విజయం నమోదు చేసుకుని భారత్ తిరిగివచ్చిన సింధు మీడియాతో మాట్లాడింది. కోర్టులో ప్రత్యర్థిపై అటాక్ చేయడమే తనకిష్టమని చెప్పింది. తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్ పాత్ర ఎనలేనివని పేర్కొంది. అంతేగాకుండా, ప్రపంచ నెంబర్ వన్ గా ఎదగడమే తన లక్ష్యమని సింధు తెలిపింది.