పద్మావతి: పద్మావతి సినిమా విడుదలను నిలిపివేయాలని భారీ ఎత్తున ఆందోళనలు
- సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన 'పద్మావతి'
- సినిమాలోని సన్నివేశాలు అభ్యంతరకరంగా తీశారని ఆరోపణలు
- రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌లో బంద్
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన 'పద్మావతి' సినిమాలోని సన్నివేశాలు అభ్యంతరకరంగా తీశారని, ఓ వర్గ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని కొందరు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాగా, పద్మావతి మూవీ విడుదలను నిలిపివేయాలని రాజస్థాన్‌లో నిరసనలు ఊపందుకున్నాయి.
ఈ సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలుపుతూ ఆ రాష్ట్రంలోని చిత్తోర్‌ఘర్‌లో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించి బంద్‌ను పాటించారు. చరిత్రను వక్రీకరించడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని రాజ్‌పుట్ కర్ణి సేన జాతీయ కన్వీనర్ ప్రమోద్ రాణా తేల్చి చెప్పారు. ఈ సినిమాలో దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌లు నటించిన విషయం తెలిసిందే.