మ‌ంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి: కొడంగ‌ల్ ఉప ఎన్నిక‌లో భారీ మెజార్టీతో గెలుస్తాం: మ‌ంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి

  • సెపక్ తక్రా 4వ ప్రపంచకప్ పోటీలను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి
  • ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ గెలుపు ఖాయం
  • 20 వేల నుంచి 30 వేల మెజార్టీ వ‌స్తుంది

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సెపక్ తక్రా 4వ ప్రపంచకప్ పోటీలను తెలంగాణ‌ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో బ్రెజిల్, చైనా, వియత్నాం, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, సింగపూర్ దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. అనంత‌రం మంత్రి మ‌హేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన కొడంగ‌ల్ కు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. ఆ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా 20 వేల నుంచి 30 వేల మెజార్టీ ఖాయమని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంత ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని చెప్పారు.
 

  • Loading...

More Telugu News